Ram Charan – Shankar : చరణ్ – శంకర్.. క్రేజీ కాంబినేషన్..

Shankar: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నారు. షో మెన్ ఆఫ్ ఇండియన్ సినిమా, సెల్యులాయిడ్ సెన్సేషన్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ చేశారు దిల్ రాజు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. రామ్ చరణ్ నటిస్తున్న 15వ సినిమా కూడా కావడం విశేషం. ‘ఎవడు’ తర్వాత svc బ్యానర్‌లో చరణ్ చేస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూటింగులో పాల్గొంటున్న చెర్రీ తర్వాత ఇండియాలో టాప్ డైరెక్టర్‌గా పేరొందిన శంకర్‌తో సినిమా చెయ్యబోతున్నారు.
‘రోబో’ టైంలో స్వయంగా చిరంజీవే తనతో సినిమా చెయ్యమని శంకర్‌ని అడిగారు కానీ వీలు పడలేదు. మెగాస్టార్ కాకపోయినా ఆయన వారసుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శంకర్‌తో సినిమా చెయ్యనుండడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.