RGV: ఈ అమ్మాయి నా వైఫ్ అయిఉంటే..! మేఘాను వదలని వర్మ

ట్రెండ్ సెట్టర్ దర్శకుడి నుండి వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య యాంకర్స్, హీరోయిన్స్ మీద.. వారి అందచందాల మీద కామెంట్స్ తోనే వార్తలలోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే

RGV: ఈ అమ్మాయి నా వైఫ్ అయిఉంటే..! మేఘాను వదలని వర్మ

Rgv

Updated On : August 31, 2021 / 2:20 PM IST

RGV: ట్రెండ్ సెట్టర్ దర్శకుడి నుండి వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య యాంకర్స్, హీరోయిన్స్ మీద.. వారి అందచందాల మీద కామెంట్స్ తోనే వార్తలలోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. అరియనా నుండి నిన్న అషురెడ్డి వరకు వర్మ వారి మీద చేసిన అరాచక కామెంట్స్.. తాజాగా బర్త్ డే పార్టీలో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. తాజాగా క్యూట్ బ్యూటీ మేఘ ఆకాష్ విషయంలో కూడా అదే జరిగింది. మేఘ ఆకాష్ ను ఆర్జీవీ తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.

Rgv

Rgv

ఊరికే పొగిడితే ఆయన వర్మ ఎందుకు అవుతాడు. అందుకే తనదైన శైలిలో బాణాలు వదిలాడు. ఓ 40 ఏళ్ళ క్రితం ఇలాంటి అమ్మాయి తనకు దొరికితే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు.. అసలు డివోర్స్ తీసుకునే వాడినే కాదు. కానీ మేఘాతో ఒక ప్రాబ్లెమ్ ఉందని, ఆమె చాలా స్వీట్ గా ఉంటుందని, ఆమెతో మాట్లాడితే డయాబెటిస్ వస్తుందేమోనని అంటూ ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేశాడు. మేఘా ఆకాష్, అదిత్‌ అరుణ్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ‘డియర్‌ మేఘ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వర్మ పొగడ్తలకు వేదికైంది.

హైదరాబాద్ లో జరిగిన డియర్ మేఘ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్మ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించగా.. ఈ బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ లో అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన దియా సినిమాకి ఇది రీమేక్ కాగా.. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నిర్మిస్తుంది. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. వర్మ మేఘా మీద కురిపించిన ప్రశంసల వర్షం ఈ సినిమాకి ప్రీ ప్రమోషన్ గా ఉపయోగపడినట్లే కనిపిస్తుంది.