RGV Vyooham : వ్యూహం మూవీ నుంచి చిరు, పవన్ లుక్స్‌ని షేర్ చేసిన ఆర్జీవీ..
ఇది బయోపిక్ కాదు రియల్ పిక్ అంటూ వర్మ వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వ్యూహం నుంచి చిరు, పవన్ లుక్స్‌ని..

Ram Gopal Varma releases Chiranjeevi Pawan Kalyan looks from Vyooham
RGV Vyooham : గత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల సమయంలో ‘లక్మిస్ ఎన్టీఆర్’ సినిమా తీసి సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఈ ఎన్నికల సమయంలో ‘వ్యూహం’, ‘శపథం’ అనే చిత్రాలను అనౌన్స్ చేసి సినీ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాడు. ఈ సినిమాలను సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు. వ్యూహం మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ చేసిన వర్మ.. ఆ మూవీలోని పాత్రలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.
Sweet Kaaram Coffee : ముగ్గురు మహిళల అందమైన రోడ్ జర్నీనే ఈ వెబ్ సిరీస్.. 240 దేశాల్లో స్ట్రీమింగ్!
ఇక ఇటీవల టీజర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఆ టీజర్ లో.. YSR హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణించిన తర్వాత ఏమైంది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ ని అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టే సన్నివేశాలు చూపించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమాలోని మరో రెండు పాత్రలను పరిచయం చేశాడు. ఆ పాత్రలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. ఈ పాత్రలు పరిచయం చేస్తూ షేర్ చేసిన ఫోటోకి.. “2+2=1” అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
2 + 2 = 1 pic.twitter.com/3PKANneyeP
— Ram Gopal Varma (@RGVzoomin) June 27, 2023
NTR Fan Shyam : అభిమాని మరణం.. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు, నిఖిల్ ట్వీట్స్..
కాగా ఈ మూవీ షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సీఎం జగన్ పాత్రలో ‘అజ్మల్ అమీర్’ కనిపిస్తున్నాడు. వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ నటిస్తుంది. ఇది బయోపిక్ కాదు రియల్ పిక్ అంటూ ప్రకటించిన వర్మ.. ఈ సినిమాతో ఎటువంటి సంచలనం సృష్టించనున్నాడో చూడాలి. ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు. గతంలో వర్మతో వంగవీటి సినిమా తెరకెక్కించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.