MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా జోకర్లు -రామ్‌గోపాల్ వర్మ

‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు మొత్తం చూస్తూ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ..

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా జోకర్లు -రామ్‌గోపాల్ వర్మ

Rgv First Lover

Updated On : October 19, 2021 / 11:25 AM IST

MAA Elections: ‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు మొత్తం చూస్తూ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ.. సినిమా నటులు చేసిన రచ్చపై ఇప్పుడు స్పందిస్తున్నారు. లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల ప్రస్తావనలు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం ఇలా.. ఈసారి విమర్శలు, ప్రతి విమర్శలు.. తిట్లు, పొగడ్తలు గుప్పించుకోగా చివరకు ఎలాగో ఎన్నికలు ముగిశాయి.

ఎన్నికల్లో విష్ణు అధ్యక్షుడిగా గెలవగా.. ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. కాంట్రవర్శియల్ విషయాల్లో నేనంటూ ముందుండే రామ్ గోపాల్ వర్మ.. ‘మా’ అసోసియేషన్ గొడవలపై మాత్రం కాస్త లేటుగా స్పందించారు.

అయితే, రామ్ గోపాల్ వర్మ విమర్శలు మాత్రం ఘాటుగానే ఉన్నాయి. మా అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో సభ్యులంతా జోకర్లు అంటూ తీవ్రంగా కామెంట్లు చేశారు. అంతకుముందు ‘మా’లోని వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ వేసిన మూడు రోజులకు మా సభ్యల గొడవలు సర్కస్‌లో జరిగినట్లుగా ఉన్నాయనే కోణంలో మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ. సిని’మా’ వాళ్లు.. సర్కస్ వాళ్లమని నిరూపించుకున్నారని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు.