బక్కగా ఓ మూలాన కూర్చున్నాడు.. కళ్లజోడు పెట్టుకుని సెట్‌లోకి వచ్చాక మెరుపులే

బక్కగా ఓ మూలాన కూర్చున్నాడు..  కళ్లజోడు పెట్టుకుని సెట్‌లోకి వచ్చాక మెరుపులే

Updated On : January 3, 2020 / 2:39 PM IST

రజనీ దర్బార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అభిమానుల కేకల మధ్య ఫుల్ జోష్‌తో జరిగింది. 70ఏళ్ల వయస్సులోనూ రజనీకాంత్‌తో ఫైట్ చేయించిన రామ్ లక్ష్మణ్‌లు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. దర్బార్ ఇంట్రడక్షన్ సీన్‌లో ఫైట్ కి చప్పట్లు, ఈలలు ఆపకుండా కొడతారని ప్రమాణం చేస్తున్నానని రామ్ చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. 

‘డైరక్టర్ మురుగదాస్ మాకు లొకేషన్‌లో స్టార్టింగే రెండ్రోజులు కంపోజ్ చేశాం. షూటింగ్ రోజు రజనీ సార్ ను కలుద్దామని వెళ్లాం. ఆయన పంచె కట్టుకుని బక్కగా ఓ మూలన కూర్చొని ఉన్నాడు. మేమంతా అనుకున్నాం ఈయన ఇలా ఉన్నాడు ఫైట్ చేయగలడా అనుకున్నాం. కాసేపటి తర్వాత కళ్లజోడు పెట్టుకుని సెట్ లోకి వచ్చాక మెరుపులే. మేం కంపోజ్ చేసిన ఫైట్ చిన్నదైపోయింది’

‘మేకప్ వేసుకున్నప్పుడు, పంచె కట్టుకున్నప్పుడు, హిమాలయాలకు వెళ్లినప్పుడు ఆయనలోని వేరియేషన్స్‌ను చూస్తుంటే మతిపోతుంది. 70ఏళ్ల వయస్సున్నా.. ఏడు సంవత్సరాల వయస్సున్న వ్యక్తిలా సింపుల్ గా ఉంటారు. డూప్ లు లేకుండా ఫైట్ లు చేశారు’ అని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.