Ramabanam Trailer: 6 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న రామబాణం ట్రైలర్
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న ‘రామబాణం’ ట్రైలర్ ను రిసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో 6 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కగా, ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

Ramabanam Trailer Trending With 6 Million Views
Ramabanam Trailer: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో, ఈసారి వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Ramabanam Trailer: రామబాణం ట్రైలర్.. ఫుల్ మీల్స్ పట్టుకొచ్చిన గోపీచంద్
ఇక ఈ రామబాణం సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. రామబాణం ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్, ఎమోషన్స్‌తో కట్ చేయడంతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర్నుండీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
Ramabanam: రామబాణం ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్..!
ఇప్పటికే ఈ ట్రైలర్‌కు ఏకంగా 6 మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కగా, యూట్యూబ్‌లో ఇంకా ట్రెండింగ్ అవుతూ దూసుకెళ్తోంది. గోపీచంద్ మాస్ యాక్షన్‌కు శ్రీవాస్ మార్క్ టేకింగ్ తోడవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మే 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.