Mahesh Babu – Jayakrishna : బాబాయ్ అండతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న అబ్బాయి.. సూపర్ హిట్ డైరెక్టర్ తో..

ఎట్టకేలకు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ.

Mahesh Babu – Jayakrishna : బాబాయ్ అండతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న అబ్బాయి.. సూపర్ హిట్ డైరెక్టర్ తో..

Ramesh Babu Son Jayakrishna Introducing as Hero with Support of Mahesh Babu

Updated On : June 8, 2025 / 10:42 AM IST

Mahesh Babu – Jayakrishna : సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మూడేళ్ళ క్రితం మహేష్ అన్న రమేష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచే రమేష్ తనయుడు జయకృష్ణని మహేష్ హీరో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ.

వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై RX 100, మంగళవరం లాంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా కథ, ప్రాజెక్టు ని మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షించారని టాలీవుడ్ టాక్. అలా బాబాయ్ అండతో అబ్బాయి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Also Read : Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఏమేం సినిమాలు తీశారో తెలుసా?

జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటన శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి జయకృష్ణకు ఘట్టమనేని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెల్కమ్ చెప్తారో చూడాలి.