డబుల్ సిమ్ కార్డ్, డబుల్ ధిమాఖ్

ఇస్మార్ట్ శంకర్.. డబుల్ సిమ్ కార్డ్, డబుల్ ధిమాఖ్..

  • Published By: sekhar ,Published On : January 3, 2019 / 11:01 AM IST
డబుల్ సిమ్ కార్డ్, డబుల్ ధిమాఖ్

ఇస్మార్ట్ శంకర్.. డబుల్ సిమ్ కార్డ్, డబుల్ ధిమాఖ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, హలో గురు ప్రేమకోసమే తర్వాత తన కొత్త సినిమాని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చెయ్యబోతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా, రామ్, పూరి కాంబోలో రూపొందబోయే సినిమా అనౌన్స్ చేసారు. పూరీ భార్య లావణ్య సమర్పణలో, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై, చార్మీతో కలిసి, ఓన్ డైరెక్షన్‌లో పూరి, ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. పూరి కనెక్ట్స్ (పూరి, చార్మికౌర్) నిర్మాతలు. హీరోగా రామ్‌కిది 17వ సినిమా. హీరోయిన్‌తో పాటు, ఇంకొంతమంది ఆర్టిస్ట్‌ల కోసం కాస్టింగ్ కాల్ కూడా కండక్ట్ చేస్తున్నారు.

రీసెంట్‌గా, పూరి 35, రామ్ 17 సినిమా టైటిల్ మోషన్  పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రామ్, పూరీల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీకి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. జనరల్‌గా పూరీ సినిమా టైటిల్స్ కాస్త ఢిఫరెంట్‌గా ఉంటాయనే విషయం తెలిసిందే. 

ఈ ఇస్మార్ట్ శంకర్, పక్కా హైదరాబాదీ స్టైల్‌లో, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందట. టైటిల్ మోషన్  పోస్టర్‌లో, కళ్ళద్దాలు పెట్టుకుని, స్టైల్‌గా సిగరెట్ కాలుస్తూ, గెడ్డంతో రఫ్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే, డబుల్ సిమ్ కార్డ్, డబుల్ ధిమాఖ్ అంటూ, చేతిలో గన్‌తో, నోట్లో సిగరెట్ పెట్టుకుని నవ్వుతున్నాడు రామ్..

మరి పూరి, లవర్ బాయ్ రామ్‌ని ఏ రేంజ్‌లో రఫ్‌గా చూపించబోతున్నాడో తెలియదు. ఒకప్పుడు వరస హిట్స్‌తో తన సత్తా చాటిన పూరి, గత కొద్ది కాలంగా తన మార్క్ చూపడంలో విఫలమవుతూ వస్తున్నాడు. ఇక రామ్ కూడా, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే  సినిమాలతో వెనకబడ్డాడు. ఇప్పుడు రామ్, పూరి కలిసి చెయ్యబోయే సినిమా ఖచ్చితంగా హిట్ అయితేనే వీళ్ళిద్దరూ తిరిగి మళ్ళీ ట్రాక్‌లోకి వస్తారు. మే నెలలో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ చెయ్యబోతున్నారు.

వాచ్ టైటిల్ మోషన్  పోస్టర్‌…