Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

రానా దగ్గుబాటి ‘భీమ్లా నాయక్’ సినిమాకి 25 రోజులకు గానూ కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్నాడు..

Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

Rana

Updated On : September 25, 2021 / 11:32 AM IST

Rana Daggubati: యంగ్ హీరో రాన దగ్గుబాటి రెమ్యునరేషన్ గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం రానా భారీ పారితోషికం అందుకుంటున్నాడట.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని పవన్ – రానా కాంబినేషన్‌లో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Bheemla Nayak : నీ మొగుడు ‘గబ్బర్ సింగ్’ అంట..! రానా దగ్గుబాటి డైలాగ్ ప్రోమో

పవన్ లుక్‌, గ్లింప్స్ అండ్ టైటిల్ సాంగ్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇటీవల రానా చేస్తున్న డానియెల్ శేఖర్ క్యారెక్టర్ తాలుకు వీడియో రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రానా నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు.

Chennakesava Reddy : ‘శరభ శరభ శరభ’.. బాలయ్య ఫ్యాన్స్ స్పెషల్ షో..

ఇక ఈ సినిమాకి 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చిన రానా అందుకుగాను అక్షరాలా 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ‘బాహుబలి’ తర్వాత మనోడి క్రేజ్ పెరింగింది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తున్నారని టాక్. నిత్యా మీనన్ కీలకపాత్రలో నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.