Rana Daggubati : WWE ప్రమోషన్స్ కోసం రానా దగ్గుబాటి

WWE తెలుగు, తమిళ్ లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళ్ లో ఈ షోని ప్రమోషన్ చేయడానికి రానా దగ్గుబాటిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలు

Rana Daggubati : WWE ప్రమోషన్స్ కోసం రానా దగ్గుబాటి

Rana

Updated On : October 29, 2021 / 12:58 PM IST

Rana Daggubati : త్వరలో సోనీ టెలివిజన్ కొత్త ఛానల్స్ ని మొదలు పెట్టబోతోంది. అంతే కాక WWE ని తమిళ్, తెలుగులో ప్రసారం చేయడానికి చూస్తుంది. త్వరలో సోని ఛానల్స్ ద్వారా WWE తెలుగు, తమిళ్ లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళ్ లో ఈ షోని ప్రమోషన్ చేయడానికి రానా దగ్గుబాటిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలు తాజాగా షూటింగ్ చేశారు.

RRR Movie : ఇకపై పివి’ఆర్ఆర్ఆర్’ థియేటర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో పీక్స్

రానా దగ్గుబాటి తాజాగా సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోనీ ఛానల్స్ కి, WWE ప్రమోషన్స్ కోసం షూటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో రానా దగ్గుబాటి WWE ఛాంపియన్‌షిప్‌ను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చాడు. సెట్‌లో కొంత మంది పిల్లలతో కూడా సరదాగా గడిపాడు. అంతే కాక ఫ్యాన్సీ హార్లే డేవిడ్‌సన్‌లో వచ్చినట్టు షూట్ చేశారు. ఈ బైక్ తో కొన్ని ఫోజులిచ్చాడు. WWE ప్రమోషనల్ వీడియోల కోసం బైక్ తో కొన్ని విన్యాసాలు కూడా చేసినట్టు తెలుస్తుంది.

Balayya : బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి గెస్ట్ గా న్యాచురల్ స్టార్

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ… తమిళ్, తెలుగు మార్కెట్‌లపై సోనీ దృష్టి సారించడం అభినందనీయం. అంతే కాక సోనీ ఛానల్స్ కి, అలాగే WWE ప్రచారం కోసం సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లతో నేను సహకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ యాడ్స్ కూడా కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుందని నేను చెప్పగలను అని అన్నారు.