Rana Daggubati : రానా ‘మానాడు’ రీమేక్ కన్‌ఫార్మ్.. కానీ తెలుగులో కాదు!

సూపర్ హిట్ టైం లూప్ మూవీ 'మానాడు'ని రానా రీమేక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రీమేక్ గురించి ఒక న్యూస్ బయటకి వచ్చింది.

Rana Daggubati : రానా ‘మానాడు’ రీమేక్ కన్‌ఫార్మ్.. కానీ తెలుగులో కాదు!

Rana Daggubati Maanaadu remake is in bollywood not tollywood

Updated On : May 29, 2023 / 2:57 PM IST

Rana Daggubati – Maanaadu : దగ్గుబాటి హీరో రానా చివరిగా విరాటపర్వం (Virata Parvam) సినిమాతో వెండితెర పై కనిపించాడు. ఇటీవల రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక కొన్ని రోజులు క్రిందటే దర్శకుడు తేజతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. కాగా రానా తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘మానాడు’ని రీమేక్ చేయబోతున్నాడు అంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో శింబు (Silambarasan) హీరోగా నటించిన ఈ సినిమా టైం లూప్ కథాంశంతో వచ్చింది.

2018 Movie : వరుస విజయాలతో గీతా ఆర్ట్స్ బ‌న్ని వాసు.. 2018 మూవీ కలెక్షన్ల సునామీ!

తెలుగులో డబ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ సురేష్ బాబు సొంతం చేసుకున్నాడని, రానాతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడని వార్తలు రాగా.. తెలుగులో ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీని మళ్ళీ రీమేక్ చేయడం ఎందుకని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించడం లేదు, హిందీలో తెరకెక్కించబోతున్నారు. రానాకి బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ తో కూడా అక్కడ మంచి విజయాన్ని అందుకున్నాడు.

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు సెట్స్‌లో అగ్ని ప్రమాదం..

ఈ సిరీస్ సెకండ్ సీజన్ కూడా త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఇప్పుడు రానా హీరోగా మానాడు చిత్రాన్ని అక్కడ రీమేక్ చేస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టేందుకు రంగం కూడా సిద్ధం చేస్తున్నారట. ఇక త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. కాగా తేజతో చేయబోతున్న సినిమా పై టాలీవుడ్ మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri) మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.