Rana – Miheeka : రానాతో స్పెషల్ ఫొటో షేర్ చేసిన భార్య.. నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ..

వీరి పెళ్లయి నాలుగేళ్లు అవుతుండటంతో రానా భార్య మిహికా బజాజ్‌ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.

Rana – Miheeka : రానాతో స్పెషల్ ఫొటో షేర్ చేసిన భార్య.. నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ..

Rana Daggubati Wife Miheeka Bajaj Shares Special Photo on their Fourth Wedding Anniversary

Updated On : August 8, 2024 / 10:15 AM IST

Rana – Miheeka : రానా దగ్గుబాటి 2020లో మిహికా బజాజ్‌ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే రానా, మిహికా బజాజ్‌ పెళ్లి చేసుకున్నారు. నేటికీ వీరి పెళ్లయి నాలుగేళ్లు అవుతుండటంతో రానా భార్య మిహికా బజాజ్‌ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.

Also Read : Ravibabu – Murari : పదేళ్ల తర్వాత ‘మురారి’ సినిమా ఏనుగు నన్ను గుర్తుపట్టింది.. రవిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

విదేశాల్లో రానాతో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి మిహికా బజాజ్‌.. జీవితం ఎప్పుడూ సరదాగా ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వే నా ప్రశాంతత, నా సంతోషం. సముద్రమంత మార్పులు వచ్చినా నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషం. నీ మీద నాకున్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఇంకోటి లేదు అని పోస్ట్ చేసింది. దీంతో మిహికా బజాజ్‌ పోస్ట్ వైరల్ గా మారింది. పలువురు ఫ్యాన్స్, సెలబ్రిటీలు రానా – మిహికా బజాజ్‌ జంటకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకంక్షాలు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Miheeka Daggubati (@miheeka)