Rana Daggubati : రజినీకాంత్ సినిమాలో రానా దగ్గుబాటి.. తలైవర్ 170 సూపర్ అప్డేట్
రజినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధి అప్డేట్స్ ఒక్కొక్కటి ఇస్తున్నారు.

Rana Daggubati will play a key role in Rajinikanth Thalaivar 170th Movie
Rana Daggubati : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జైలర్ సినిమా భారీ విజయం సాధించి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. త్వరలో సంక్రాంతికి లాల్ సలాం సినిమాతో రాబోతున్నారు రజిని. ఈ సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. ఫ్యాన్స్ అంతా తలైవర్ 170వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
రజినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధి అప్డేట్స్ ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించగా ఇందులో మంజూ వారియర్ (Manju Warrier), రితికా సింగ్ (Ritika Singh), దుషారా విజయన్ (Dushara Vijayan)లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Also Read : Balakrishna : NBK109 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్.. సెకండాఫ్ 40 నిముషాలు.. కానీ ఏపీ పాలిటిక్స్ వల్ల..
తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటించబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ ప్రకటనతో అంతా ఆశ్చర్యపోయారు. రానా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు రానా. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు రానాకి కంగ్రాట్స్ చెప్తున్నారు. అలాగే తలైవర్ 170 సినిమాలో ఇంకా కొంతమంది స్టార్లు ఉండబోతున్నట్టు సమాచారం.