The Rana Daggubati Show : రానా దగ్గుబాటి టాక్ షో ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.. సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారంటే..
తాజాగా నేడు ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ రిలీజ్ చేసారు.

Rana New Talk Show The Rana Daggubati Show Trailer Released
The Rana Daggubati Show : రానా దగ్గుబాటి హోస్ట్ గా గతంలో నెంబర్ 1 యారి అనే టాక్ షో చేసి మెప్పించాడు. తాజాగా రానా ఇప్పుడు ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో మరో కొత్త టాక్ షోతో రాబోతున్నాడు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ షో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోని రానానే నిర్మాతగా తన స్పిరిట్ మీడియాపై నిర్మించాడు.
Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఆల్బమ్.. సాహిబా సాంగ్ వచ్చేసింది..
తాజాగా నేడు ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇంటర్వ్యూ ఒక చోట అని కాకుండా రకరకాల ప్లేసెస్ లో చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ షోకి ఆర్జీవీ, రాజమౌళి, నాగచైతన్య, శ్రీలీల, సిద్ధూ జొన్నలగడ్డ, రానా భార్య మిహీక, నాని, తేజ సజ్జ, దుల్కర్ సల్మాన్, రిషబ్ శెట్టి.. పలువురు స్టార్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఫుల్ కామెడీగా ఉంది. కామెడీతో పాటు సెలబ్రిటీలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మీరు కూడా ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ చూసేయండి..