Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఆల్బమ్.. సాహిబా సాంగ్ వచ్చేసింది..
విజయ్ దేవరకొండ, రాధికా మదన్ మెయిన్ లీడ్స్ గా పీరియాడిక్ లవ్ స్టోరీతో సాహిబా అనే సాంగ్ ని కంపోజ్ చేసింది జస్లీన్.

Vijay Deverakonda Radhika Madan Jasleen Royal Sahiba Song Released
Vijay Deverakonda : బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్ పలు ప్రైవేట్ సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటుంది. ప్రైవేట్ సాంగ్స్ తో పాటు సినిమాలో కూడా సాంగ్స్ రాయడం, పాడటం చేస్తుంది. ఈమె ప్రైవేట్ ఆల్బమ్స్ లో స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తారు. గతంలో దుల్కర్ తో హీరియే అనే ఓ ప్రవేట్ ఆల్బమ్ ని కంపోజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ తో వచ్చింది.
విజయ్ దేవరకొండ, రాధికా మదన్ మెయిన్ లీడ్స్ గా పీరియాడిక్ లవ్ స్టోరీతో సాహిబా అనే సాంగ్ ని కంపోజ్ చేసింది జస్లీన్. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా తాజాగా నేడు ఈ సాహిబా సాంగ్ ని విడుదల చేసారు. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి..
ఇక ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ ఓ ఫోటోగ్రాఫర్ గా పనిచేసినట్టు, ఫొటో తీయడానికి వెళ్లి ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్టు చూపించారు. విజయ్ ప్రైవేట్ సాంగ్ చేయడంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ ని వైరల్ చేస్తున్నారు.