Thaman – Pushpa 2 : నాతో పాటు ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ పుష్ప 2కు వర్క్ చేస్తున్నారు.. తమన్ వ్యాఖ్యలు వైరల్..

పుష్ప 2 కు దేవిశ్రీ వర్క్ చేస్తుండగానే తమన్ ని కూడా తీసుకున్నారని పలు వార్తలు వచ్చాయి.

Thaman – Pushpa 2 : నాతో పాటు ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ పుష్ప 2కు వర్క్ చేస్తున్నారు.. తమన్ వ్యాఖ్యలు వైరల్..

Thaman gives Clarity on he Working For Pushpa 2 Watch Here

Updated On : November 15, 2024 / 12:06 PM IST

Thaman – Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ట్రైలర్ 17వ తేదీన రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ పుష్ప సినిమాకు దేవిశ్రీ అదిరిపోయే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఆ పాటలు, BGM కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ పార్ట్ 2 కు దేవిశ్రీ వర్క్ చేస్తుండగానే తమన్ ని కూడా తీసుకున్నారని, రవి బస్రుర్ ని కూడా తీసుకున్నారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా నేడు బాలకృష్ణ 109 వ సినిమా డాకు మహారాజ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో తమన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? ఆ సినిమాకు అయితే పడీ పడీ నవ్వాడట..

ఓ మీడియా ప్రతినిధి పుష్ప 2 రూమర్స్ గురించి తమన్ ని ప్రశ్నించగా తమన్ స్పందిస్తూ.. పుష్ప 2 లో నేను ఒక పార్ట్ మాత్రమే. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసాను. అవుట్ పుట్ అయితే అదిరిపోయింది. పుష్ప 2 సినిమా నాకు మంచి హై ఇచ్చింది. సినిమాకు నేను చేయాల్సింది చేశాను అని అన్నారు. దీంతో పుష్ప 2 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమన్, మరికొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి దేవి అంత మంచి హిట్ సాంగ్స్, BGM ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని సుకుమార్ ఎందుకు తెచ్చాడో.