Ranbir Kapoor : నాన్నా ఈ అవార్డు మీకే.. ఎమోషనల్ అయిన రణబీర్ కపూర్.. యానిమల్ ఫిలింఫేర్ అవార్డు..

తాజాగా జరిగిన 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డు తీసుకున్న అనంతరం రణబీర్ కపూర్ ఎమోషనల్ అయి..

Ranbir Kapoor : నాన్నా ఈ అవార్డు మీకే.. ఎమోషనల్ అయిన రణబీర్ కపూర్.. యానిమల్ ఫిలింఫేర్ అవార్డు..

Ranabir Kapoor Emotional Speech in Filmfare Awards 2024 after Receiving Best Actor Award for Animal Movie

Updated On : January 30, 2024 / 11:25 AM IST

Ranbir Kapoor : రణబీర్ కపూర్ ఇటీవల యానిమల్(Animal) సినిమాతో వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాన్న ఎమోషన్ తో పాటు ప్రేమ, యాక్షన్ సీన్స్ తో యానిమల్ సినిమా అందర్నీ మెప్పించింది. ఆల్మోస్ట్ 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ దాదాపు ఎనిమిది వేరియేషన్స్ లో కనిపించి తన నటనతో అదరగొట్టాడు.

తాజాగా జరిగిన 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో(Filmfare Awards) రణబీర్ కపూర్ యానిమల్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డు తీసుకున్న అనంతరం రణబీర్ కపూర్ ఎమోషనల్ అయి.. నాన్నా నేను ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తాను. మీరు నాపై చూపించిన ప్రేమని రోజూ గుర్తు చేసుకుంటున్నా. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి. ఈ అవార్డు మీకే నాన్న అని మాట్లాడాడు. నాన్న ఎమోషన్ తో వచ్చిన సినిమాకి అవార్డు అందుకొని నాన్నని గుర్తుచేసుకొని నాన్నకి అంకితం ఇవ్వడంతో అభిమానులు, పలువురు నెటిజన్లు రణబీర్ ని అభినందిస్తున్నారు. రణబీర్ తండ్రి, దివంగత నటుడు రిషికపూర్ 2020 లో మరణించారు.

Also Read : Sharathulu Varthisthai : ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’ పెళ్లి సాంగ్ విన్నారా? ఇక నుంచి తెలంగాణ పెళ్లి వేడుకల్లో ఈ సాంగ్ వినపడాల్సిందే..

రణబీర్ తన కూతురు రాహాని కూడా గుర్తుచేస్తూ.. రాహా పుట్టిన వారం రోజులకే యానిమల్ సినిమా షూట్ మొదలుపెట్టాం. తనని మిస్ అవ్వకూడదని డైలీ షూట్ అవ్వగానే ఇంటికి వెళ్లిపోయేవాడ్ని. రాహా.. ఇవాళ నేను, మీ అమ్మ నువ్వు ఆడుకోడానికి రెండు అవార్డులు తీసుకొస్తున్నాం అని అన్నాడు. ఇదే ఫిలింఫేర్ అవార్డుల్లో రణబీర్ భార్య, హీరోయిన్ అలియాభట్ రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు ఒకేసారి అందుకోవడం విశేషం.