Unstoppable : యానిమల్‌తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది.. అన్‌స్టాపబుల్ న్యూ ఎపిసోడ్..
యానిమల్‌తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. రణబీర్ కపూర్ తో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడో రిలీజ్ అవుతుందో తెలుసా..?

Ranbir Kapoor Balakrishna Unstoppable episode streaming date announced
Unstoppable with NBK : బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో మొదలైన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK. బాలయ్య హోస్టింగ్ తో అదిరిపోయే అతిథులతో ఈ టాక్ షో తెలుగులో బిగ్గెస్ట్ ప్రోగ్రాంగా వ్యూయర్ షిప్ అందుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. ఒకదాన్ని మించి మరో సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ షో మూడో సీజన్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల దసరా సమయంలో ఒక స్పెషల్ ఎపిసోడ్ తో మూడో సీజన్ ని స్టార్ట్ చేశారు.
ఆ ఎపిసోడ్ లో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీ టీం అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ షోకి బాలీవుడ్ నుంచి గెస్టులు రాబోతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా ప్రస్తుతం హిందీలో ‘యానిమల్’ అనే గ్యాంగ్‌స్టార్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని బాలయ్య అన్‌స్టాపబుల్ నుంచే మొదలు పెట్టబోతున్నారు.
Also read : Merry Christmas : సంక్రాంతికి వస్తున్న క్రిస్మస్.. మహేష్‌కి పోటీగా రాబోతున్నారా..?
? Date gurthupettukondi… Nov 24 it is! Wildest Episode of the season gonna hit the screens! #UnstoppableWithNBK #Animal?#NandamuriBalakrishna #RanbirKapoor @iamRashmika @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/qWbi2YEPZW
— ahavideoin (@ahavideoIN) November 16, 2023
రణబీర్, రష్మిక, సందీప్ వంగా.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. దీంతో షో నిర్వాహకులు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి డేట్ ని ఫిక్స్ చేశారు. యానిమల్‌తో లయన్ మీటింగ్‌కి నవంబర్ 24న టైం ఫిక్స్ చేశారు. ఈ వైల్డ్ ఎపిసోడ్ 24న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. కానీ కచ్చితమైన టైంని తెలియజేయలేదు. కాగా ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ఫోన్ కాల్ ద్వారా పాల్గొన్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో రష్మిక, విజయ్ గురించి బాలయ్య ఏం ప్రశ్నించారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.