Ranbir Kapoor : పాక్ సినిమాలో నటిస్తాను అంటున్న రణబీర్ కపూర్..

బ్రహ్మాస్త్ర హీరో 'రణబీర్ కపూర్' పాక్ సినిమాలో నటిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రణబీర్.. సౌదీ అరేబియాలో జరిగే 'రెడ్ సి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'కి హాజరయ్యాడు. ఆ వేడుకల్లో రణబీర్ ని పాకిస్తానీ మూవీస్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రణబీర్..

Ranbir Kapoor : పాక్ సినిమాలో నటిస్తాను అంటున్న రణబీర్ కపూర్..

Ranbir Kapoor says he will act in a Pakistani film

Updated On : December 15, 2022 / 10:59 AM IST

Ranbir Kapoor : బ్రహ్మాస్త్ర హీరో ‘రణబీర్ కపూర్’ పాక్ సినిమాలో నటిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న ఈ హీరో ఇటీవలే తండ్రి కూడా అయ్యాడు. దీంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు రణబీర్. ప్రస్తుతం ఈ హీరో ‘తు ఝూతి మై మక్కార్’ అనే ఒక లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రణబీర్ కి జంటగా శ్రద్ధా కపూర్ నటిస్తుంది.

Ranbir Kapoor : ఆ సినిమా నా గడ్డం వల్లే హిట్ అవ్వలేదు..

తాజాగా రణబీర్.. సౌదీ అరేబియాలో జరిగే ‘రెడ్ సి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కి హాజరయ్యాడు. ఆ వేడుకల్లో రణబీర్ ని పాకిస్తానీ మూవీస్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రణబీర్.. “కళకు, కళాకారులకు సరిహద్దులతో సంబంధం ఉండదు. కాబట్టి ఛాన్స్ వస్తే చేస్తాను. పాకిస్తాన్ లోనే కాదు, ఇప్పుడు నేను ఉన్న సౌదీ పరిశ్రమ అవకాశం ఇచ్చినా చేస్తాను” అంటూ బదులిచ్చాడు.

అలాగే పాకిస్తాన్ సూపర్ హిట్ మరియు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి ఎంపిక అయిన ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్‌’ చిత్రాన్నికి తన అభినందనలు కూడా తెలియజేశాడు రణబీర్. అయితే ఈ హీరో ఇచ్చిన స్టేట్‌మెంట్ పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తున్నారు. రణబీర్ అండ్ అలియా పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.