Wild with Bear Grylls : నెట్‌ఫ్లిక్స్ వీడియో కోసం పురుగుని తిన్న రణ్‌వీర్..
బేర్ గ్రిల్స్‌తో కలిసి రణ్‌వీర్ చేసిన ఈ అడ్వెంచర్స్ రణ్‌వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ ప్రోగ్రాం ప్రమోషన్స్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్.............

Ranveer
Wild with Bear Grylls : బేర్ గ్రిల్స్‌తో కలిసి స్టార్స్ అడవిలో అడ్వెంచర్స్ చేస్తూ ఆ వీడియోల్ని వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అనే పేరుతో ఓ ప్రోగ్రాంలా రిలీజ్ చేస్తారు. వైల్డ్ లైఫ్, అడవులు .. ఇలాంటివాటిని ఇష్టపడే వాళ్ళకి ఈ బేర్ గ్రిల్స్ షో నచ్చుతుంది. గతంలో రజినీకాంత్, ధోని లాంటి పలువురు ఇండియన్ స్టార్స్ ఈ బేర్ గ్రిల్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ బేర్ గ్రిల్స్ తో కలిసి అడవిలో అడ్వెంచర్స్ చేశాడు.
బేర్ గ్రిల్స్‌తో కలిసి రణ్‌వీర్ చేసిన ఈ అడ్వెంచర్స్ రణ్‌వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ ప్రోగ్రాం ప్రమోషన్స్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రణ్‌వీర్ పురుగుని తిన్నాడు. సూటుబూటేసుకొని చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న రణ్‌వీర్ ముందు ప్లేట్ లో ఓ పురుగును పెట్టారు. తినాలా వద్దా అని ఆలోచిస్తూ అయిష్టంగా ఆ పురుగుని నోట్లో పెట్టుకొని తినేసాడు రణ్‌వీర్.
Sai Pallavi : సాయి పల్లవికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..
దీంతో రణ్‌వీర్ పురుగుని తిన్న ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే కొంతమంది అది ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మరీ ఈ రేంజ్ లో ప్రమోషన్స్ అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ప్రోగ్రాంని ఇష్టపడే వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.