Sai Pallavi : సాయి పల్లవికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..

స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి తాజాగా తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు...........

Sai Pallavi : సాయి పల్లవికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..

Sai Pallavi

Sai Pallavi :  స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి తాజాగా తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాని, గోరక్షకులను గురించి మాట్లాడుతూ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేశవ్యాప్తంగా హిందువులు సాయిపల్లవి వ్యాఖ్యలని వ్యతిరేకించారు. పలు చోట్ల సాయిపల్లవిపై కేసులు నమోదు అయ్యాయి.

Tamannaah : తమన్నా ఆస్తుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఓ భజ్‌రంగ్‌ దళ్‌ కార్యకర్త ఫిర్యాదుతో హైదరాబాద్ సుల్తాన్‌ బజార్‌ పోలీస్ స్టేషన్ లో కూడా సాయిపల్లవి పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు సాయిపల్లవికి జూన్‌ 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కానీ సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. ఆమె పోలీసులు జారీ చేసిన నోటీసులకు స్పందించాల్సిందే అని తెలిపింది.