Tamannaah : తమన్నా ఆస్తుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

15 ఏళ్లుగా లాంగ్ కెరీర్ ఉన్న తమన్నా తన కెరీర్ లో సినిమాలు, ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్, యాడ్స్, షాప్ ఓపెనింగ్స్.. ఇలా అన్ని రకాలుగా బాగానే సంపాదించింది. ఇటీవల............

Tamannaah : తమన్నా ఆస్తుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Tamannaah

Tamannaah :  కెరీర్ మొదలుపెట్టి దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. శ్రీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలందరి సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది, ఇంకా చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే F3 సినిమాతో మెప్పించిన తమన్నా ప్రస్తుతం తెలుగులో సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం, చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాల్లో చేస్తోంది.

 

15 ఏళ్లుగా లాంగ్ కెరీర్ ఉన్న తమన్నా తన కెరీర్ లో సినిమాలు, ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్, యాడ్స్, షాప్ ఓపెనింగ్స్.. ఇలా అన్ని రకాలుగా బాగానే సంపాదించింది. ఇటీవల ప్రపంచంలో పెద్ద వజ్రాల్లో ఒకటైన వజ్రం తమన్నా దగ్గర ఉందని సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. తమన్నాకి ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ఏరియాలో దాదాపు 16 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది. హైదరాబాద్ లో కూడా ఓ ఖరీదైన ఇల్లు ఉంది. అంతేకాక తమన్నా దగ్గర కోటి రూపాయల మెర్సిడెస్ బెంజ్, 80 లక్షల రేంజ్ రోవర్‌, 50 లక్షల బీఎండబ్ల్యూ, మరో కారు కూడా ఉన్నాయి. ఇక తన సొంత ఊళ్ళో ఒక సొంత ఇల్లు, తన పేరెంట్స్ ఉండే ఇంటితో పాటు మరిన్ని ఆస్తులు బాగానే కూడబెట్టిందని సమాచారం.

Venu Tottempudi : అందుకే ఇన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్నాను..

తమన్నా మొత్తం ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన 15 ఏళ్లలో బాగానే సంపాదించింది అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈజీగా మరో 5 ఏళ్ళు హీరోయిన్ గా కెరీర్ ని లాగేట్లు ఉంది అని సినీ వర్గాలు అంటున్నాయి.