Venu Tottempudi : అందుకే ఇన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్నాను..

వేణు సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వేణు మాట్లాడుతూ..''నేను సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం...........

Venu Tottempudi : అందుకే ఇన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్నాను..

Venu

Venu Tottempudi :  ‘స్వయంవరం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, గోపి గోపిక గోదావరి, హనుమాన్‌ జంక్షన్‌, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, కళ్యాణ్ రాముడు.. ఇలా వరుస హిట్స్ సాధించాడు. ఇలా వరుస హిట్స్ తో స్టార్ హీరోగా మారుతాడు అనుకున్నారు కానీ సడెన్ గా సినిమాలకి దూరమయ్యారు. చివరిసారిగా దమ్ము సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు వేణు. త్వరలో రవితేజ హీరోగా చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్ పాత్రతో రీ ఎంట్రీ ఇస్తున్నారు వేణు.

ఈ సందర్భంగా వేణు సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వేణు మాట్లాడుతూ..”నేను సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల, నా పర్సనల్ సమస్యల వల్ల ఇన్ని రోజులు నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ ఇప్పుడు రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను సీఐ మురళిగా కనిపిస్తాను. దీనికి సంబంధించిన పోస్టర్‌ కూడా విడుదలైంది. ప్రస్తుతం రామారావు ఆన్‌డ్యూటీతో పాటు పారా హుషార్‌ అనే మరో సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాను”

Vishal : ప్రేమలో ఉన్నా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా..

”మొదట ఈ మూవీలో నటించమని డైరెక్టర్ శరత్‌ నాకు చాలాసార్లు ఫోన్‌ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. చివరికి మీరు ఈ సినిమాలో నటించకపోయినా పర్వాలేదు కానీ ఓసారి కలుద్దాం అని శరత్‌ మెసేజ్‌ చేస్తే ఓసారి మీట్‌ అయ్యాను. కలిసినప్పుడు మాటల్లో ఈ సినిమా గురించి, అందులో నా పాత్ర గురించి చెప్పాడు. మీకు నమ్మకం ఉంటేనే చేయండి అని చెప్పాడు. రెండు మూడుసార్లు ఆ పాత్ర గురించి శరత్‌తో చర్చించి సినిమా ఓకే చేశాను. మళ్ళీ వరుసగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను” అని తెలిపారు.

View this post on Instagram

A post shared by SLV Cinemas (@slv_cinemas)