Vishal : ప్రేమలో ఉన్నా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''పెద్దలు కుదిర్చిన సంబంధాలు నాకు సెట్ అవ్వవు, కాబట్టి లవ్‌ మ్యారేజే చేసుకుంటాను. ప్రస్తుతం.......

Vishal : ప్రేమలో ఉన్నా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా..

Vishal

Vishal :  తెలుగు వాడైనా తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. వరుస సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇటీవలే హైదరాబాద్ లో లాఠీ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు విశాల్‌. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి తన పెళ్లి గురించి మాట్లాడాడు విశాల్.

విశాల్‌కు 2019లోనే నటి అనీషాతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయంలో అనుకోని కారణాలతో విడిపోయారు. తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ నడిగర్‌ సంఘానికి భవనం కట్టించాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు. అయితే తాజాగా త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు.

Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ”పెద్దలు కుదిర్చిన సంబంధాలు నాకు సెట్ అవ్వవు, కాబట్టి లవ్‌ మ్యారేజే చేసుకుంటాను. ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో కూడా ఉన్నాను. త్వరలోనే ఆమె ఎవరో చెప్తాను. త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకుంటాను” అని తెలిపాడు. మరి విశాల్ ని చేసుకోబోయే ఆ లక్కీ అమ్మాయి ఎవరో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.