Ranveer Singh : అసలు ట్రోఫీ తన దగ్గరే ఉందంటున్న రణ్‌వీర్..
వరల్డ్ ఫేమస్ గేమ్ 'ఫిఫా వరల్డ్ కప్' ఫైనల్ నిన్న రాత్రి జరిగింది. ఇక ఈ వరల్డ్ కప్ లో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోణె సందడి చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ని ఆవిష్కరించడానికి దీపిక ఆహ్వానం అందుకుంది. ఈ క్రమంలోనే దీపికతో పాటు రణ్‌వీర్ కూడా కతర్ వెళ్ళాడు. దీంతో దీపికా వరల్డ్ కప్ ని ఆవిష్కరిస్తున్న...

Ranveer says that the actual trophy is with him
Ranveer Singh : వరల్డ్ ఫేమస్ గేమ్ ‘ఫిఫా వరల్డ్ కప్’ ఫైనల్ నిన్న రాత్రి జరిగింది. ఈ ఫైనల్ లో అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఆఖరి పోరు ఉత్కంఠ భరితంగా జరిగింది. హోరాహోరిగా సాగిన గేమ్ లో ఇరు జట్టులు సమాన స్కోర్ ని సంపాదించడంతో, పెనాల్టీ షూటౌట్ ఇచ్చారు. ఇందులో ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం సాధించి, 36ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ టైటిట్ ను కైవసం చేసుకుంది.
ఇక ఈ వరల్డ్ కప్ లో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోణె సందడి చేశారు. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే ఆట వేదికపై అరుదైన గౌరవం దక్కించుకొని, భారతదేశం తరుపు నుంచి మొదటి వ్యక్తిగా నిలిచింది దీపికా. అదేంటంటే ఫిఫా వరల్డ్ కప్ ని ఆవిష్కరించడానికి దీపిక ఆహ్వానం అందుకుంది. ఈ క్రమంలోనే దీపికతో పాటు రణ్‌వీర్ కూడా కతర్ వెళ్ళాడు.
దీంతో దీపికా వరల్డ్ కప్ ని ఆవిష్కరిస్తున్న దృశ్యాలను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు రణ్‌వీర్. ఇక ఆ పోస్ట్‌కి.. ‘అసలైన ట్రోఫీ నాతోనే ఉంది. వరల్డ్‌కప్ ట్రోఫీతో నా ట్రోఫీ’ అంటూ దీపికాని ఉద్దేశించి కామెంట్ చేశాడు. కాగా ప్రస్తుతం దీపికా పఠాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాలోని ‘బేషరం రంగ్’ సాంగ్ లో ఆమె వస్త్రధారణ విషయంలో తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది.