కరోనా ఎఫెక్ట్: ర‌ణ్‌వీర్ సింగ్ ’83’ వాయిదా

  • Published By: veegamteam ,Published On : March 20, 2020 / 05:19 AM IST
కరోనా ఎఫెక్ట్: ర‌ణ్‌వీర్ సింగ్ ’83’ వాయిదా

Updated On : March 20, 2020 / 5:19 AM IST

ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను ’83’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 1983లో భారత జట్టు ప్రపంచకప్‌ ఎలా సాధించింది అన్న నేపథ్యంతో ఈ సినిమా తీస్తున్నారు. క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో వహిస్తున్నారు. రణ్‌వీర్‌కు జోడీగా దీపిక పదుకొణె  రోమి అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు.

అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమాను మరికొద్ది రోజులు  వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌తే మాకు ముఖ్యం. అందుకే చిత్రాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తాం అని మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు. ప్రస్తుతం కరోనా భ‌య‌ంతో ప్ర‌జ‌లు సినిమా థియేట‌ర్స్ వైపే చూడ‌డం మానేశారు. దీంతో చాలా సినిమాలు వాయిదా ప‌డుతున్నాయి.(బిగ్ బ్రేకింగ్ : భారత్‌లో కరోనా..ఐదో మృతి)

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు అవుట్‌డోర్ షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారు. అవసరమైతే షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు కానీ బయటకు మాత్రం అస్సలు వెళ్లడం లేదు. ఇంట్లోనే జిమ్ చేసుకుంటున్నారు.