పవన్, ప్రభాస్ తర్వాత రష్మీనే..

కరోనా ఎఫెక్ట్ : పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళమందించిన యాంకర్ రష్మీ గౌతమ్..

  • Published By: sekhar ,Published On : March 30, 2020 / 01:11 PM IST
పవన్, ప్రభాస్ తర్వాత రష్మీనే..

Updated On : March 30, 2020 / 1:11 PM IST

కరోనా ఎఫెక్ట్ : పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళమందించిన యాంకర్ రష్మీ గౌతమ్..

కరోనా మహమ్మారి రోజురోజుకీ విలయ తాండవం చేస్తోంది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు కూడా తమవంతు సాయమందించడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల యాంకర్ ప్రదీప్ టెలివిజన్ రంగంలో రోజువారీ వేతనానికి పనిచేసే 50 నుంచి 60 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలియచేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఫేమస్ యాంకర్ రష్మీ గౌతమ్ పీఎం కేర్స్ ఫండ్‌కి తనవంతు విరాళమందించినట్లు తెలిపింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘జబర్ధస్త్’ షో ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ.. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన వంతు సాయం అందించింది. తాజాగా రష్మీ కూడా పీఎం కేర్స్‌కు రూ. 25000 పంపించి తన ఉదారతను చాటుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. పీఎం కేర్స్‌కు పంపించిన ఫండ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఆమె తన ట్వీట్‌కు యాడ్ చేసింది.

Read Also : వీడియోలు షేర్ చెయ్యొద్దు – ఎలా కనిపిస్తే ఏంటి.. మనమేం పిల్లలం కాదు..

‘నా వంతు సాయం నేను అందించాను. ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో తమకు తోచినంతగా సాయం చేయండి’’ అని రష్మీ కోరింది. చాలా మంచి పని చేసావంటూ పలువురు రష్మీని అభినందిస్తుంటే.. టీవీ షోలకు ఎపిసోడ్‌కు ఇంత అని చార్జ్ చేసే రష్మీకి 25 వేలు పెద్ద అమౌంట్ కాదని, పీఎం ఫండ్‌కు కాబట్టి కాస్త పెద్దమొత్తంలో డొనేట్ చేసుంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళమందించింది రష్మీనే కావడం విశేషం.