Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ ట్రిప్స్ పై రష్మిక కామెంట్స్..

నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటీవల ఒక ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ ట్రిప్స్ మాట్లాడుతూ..

Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ ట్రిప్స్ పై రష్మిక కామెంట్స్..

rashmika vijay devarakonda

Updated On : January 19, 2023 / 11:46 AM IST

Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక మందన రీసెంట్ గా తమిళ సినిమా ‘వరిసు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టు టాక్ ని సొంతం చేసుకుంది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. మొదటి వారం ముగిసే సరికి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టిస్తుంది.

Rashmika Mandanna : గొడవ ముగిసిందా.. రిషబ్, రక్షిత్ పై పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన రష్మిక..

కాగా ఈ నేషనల్ క్రష్ ఇటీవల ఒక ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల న్యూ ఇయర్ సమయంలో విజయ్ దేవరకొండ, రష్మిక.. విషెస్ చెబుతూ వారి ఫోటోలను షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలు మాల్దీవ్స్ లో దిగినవి కావడంతో వీరిద్దరి కలిసి అక్కడికి వెళ్లారు. అంతేకాదు వీరిద్దరూ రహస్య ప్రేమాయణం నడుపుతున్నారు అని పలు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయం పై విలేకరి ప్రశ్నించగా రష్మిక బదులిచ్చింది.

‘నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో విజయ్ ఒకడు. ఆ నిజాన్ని నేను నిర్భయంగా చెబుతాను. ఆన్ స్క్రీన్ పై మా కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో, బయట మేము ఇద్దరు స్నేహితులుగా తిరుగుతున్నా ఆడియన్స్ మమ్మల్ని ప్రేమికుల గానే చూస్తున్నారు. ఫ్రెండ్స్ కూడా కలిసి వెకేషన్ ట్రిప్ కి వెళ్తారు. అలా వెకేషన్ ట్రిప్ కి మాతో పాటు 10 మంది మిత్రులు కూడా వచ్చారు. కానీ వారిలో మా ఇద్దర్నే నోటీసు చేస్తున్నారు. ఎందుకంటే మేము పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. అయినా మా రిలేషన్‌షిప్ గురించి అబద్దం చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అంటూ బదులిచ్చింది. ఈ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని అర్ధమవుతుంది. మరి ఇప్పటికైనా వీరిద్దరి మీద వచ్చే రూమర్స్ తగ్గుతాయా లేదా అనేది చూడాలి.