Rashmika Mandanna : 5 లగ్జరీ ఇళ్ళు కొన్న రష్మిక అంటూ వార్తలు.. కౌంటర్ ఇచ్చిన రష్మిక..
సినీ పరిశ్రమలో సెలబ్రిటీలపై గాసిప్స్, రూమర్స్ కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి. ఇక రష్మిక పై మరింత ఎక్కువ గాసిప్స్, రూమర్స్ రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. తాజాగా గత కొన్ని రోజుల నుంచి రష్మిక బాగా డబ్బులు సంపాదించింది, రష్మిక 5 నగరాల్లో 5 లగ్జరీ ఇళ్ళు కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి.................

Rashmika countered the news that Rashmika bought 5 luxury houses
Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు, తమిళ్, హిందీలో బిజీగా ఉంది. ఇటీవలే సంక్రాంతికి వారసుడు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులని పలకరించింది. ఇక మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులని పలకరించింది. ఒక వైపు సినిమాలతో మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తుంది.
సినీ పరిశ్రమలో సెలబ్రిటీలపై గాసిప్స్, రూమర్స్ కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి. ఇక రష్మిక పై మరింత ఎక్కువ గాసిప్స్, రూమర్స్ రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. తాజాగా గత కొన్ని రోజుల నుంచి రష్మిక బాగా డబ్బులు సంపాదించింది, రష్మిక 5 నగరాల్లో 5 లగ్జరీ ఇళ్ళు కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, గోవా, కూర్గ్ లలో రష్మిక భారీ బడ్జెట్ తో 5 లగ్జరీ ఇళ్ళు కొందని పలు వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
తాజాగా సోషల్ మీడియాలో ఒకరు ఈ వార్తని పోస్ట్ చేయగా రష్మిక మందన్న దీనికి రిప్లై ఇచ్చింది. ఈ వార్తకి రష్మిక రిప్లై ఇస్తూ.. ఇది నిజమవ్వాలని కోరుకుంటున్నాను అన్ని ట్వీట్ చేసింది. దీంతో రష్మిక కౌంటర్ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక రష్మిక ఇచ్చిన జవాబుతో ఇది ఫేక్ న్యూస్ అని క్లారిటీ వచ్చింది.
??I wish it were true
— Rashmika Mandanna (@iamRashmika) February 10, 2023