షాహిద్ కపూర్‌కు నో చెప్పిన రష్మికా మంధాన

దక్షిణాది హీరోయిన్, ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్‌ల సినిమాల్లో కనిపించి మెప్పించిన రష్మిక మంధాన బాలీవుడ్ ఆఫర్ కు నో చెప్పేసింది. షాహిద్ కపూర్ హీరోగా తీస్తున్న తెలుగు రీ మేక్‌ను తిరస్కరించిందట. నాని నటించిన క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన జెర్సీ మూవీని షాహిద్ కపూర్ హీరో క్యారెక్టర్‌లో నటిస్తున్నారు.
హీరోయిన్ పాత్రలో నటించమని మృనాల్ ఠాకూర్‌ను అడగడంతో రెమ్యూనరేషన్ భారీగా చెప్పిందంట. దీంతో ఆమె స్థానంలో రష్మికను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయలేనని వేరేవాళ్లని చూసుకొమ్మని చెప్పేసిందీ మేడమ్.
‘నేనేదైనా సినిమాలో భాగమైతే దానికి పూర్తి న్యాయం చేయాలనుకుంటాను. అలా నమ్మకం లేకపోతే ఆ సినిమాను నేను ఒప్పుకోను. జెర్సీ లాంటి మూవీ రీమేక్ పెద్ద విషయం. ఆ పాత్రకు నేను సరిపోననిపించింది. ఆ పాత్రకు తగ్గ ఎనర్జీ ఉన్న నటిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నట్లు రష్మిక చెప్పుకొచ్చింది.
కానీ, ఆ సినిమాను తిరస్కరించడానికి కారణం భారీ స్థాయిలో చెక్ అడగడమేనని వస్తున్న వార్తలకు స్పందించింది. ‘ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఆ పాత్రకు ఎంత న్యాయం చేయగలమోనని’ రష్మిక వివరించింది.
సూపర్ స్టార్ సరసన నటించిన రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సంక్రాంతికి విడుదల కానుండగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న భీష్మ సినిమాలో నితిన్‌కు జోడీగా కనిపించనుంది ఈ మేడమ్.