Rashmika – Vijay : ఫ్యాన్స్ ని నిరాశపరిచిన విజయ్ – రష్మిక.. కావాలనే అలా చేశారా? చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి..
తీరా చూస్తే విజయ్ - రష్మిక ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. (Rashmika - Vijay)
Rashmika Vijay
Rashmika – Vijay : గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రష్మిక – విజయ్ దేవరకొండ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అధికారికంగా వీళ్ళిద్దరూ ఈ విషయం ప్రకటించకపోయినా విజయ్ – రష్మిక టీమ్ మీడియాకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఇద్దరూ ఎంగేజిమెంట్ రింగ్స్ తో కనిపించి సందడి చేసారు. అయితే బుధవారం రాత్రి ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వస్తున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ పెళ్లి, నిశ్చితార్థం గురించి మాట్లాడతారేమో, వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు వస్తాయని ఎదురుచూసారు.(Rashmika – Vijay)
తీరా చూస్తే విజయ్ – రష్మిక ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఈవెంట్ అంతా విజయ్ – రష్మిక అసలు కలిసి కనిపించలేదు, పక్కన పక్కన నిల్చోలేదు. కూర్చునేటప్పుడు, పైన స్టేజి మీద విజయ్ – రష్మిక మధ్యలో అల్లు అరవింద్ ని పెట్టారు. వీరిద్దరిది ఒక్క ఫోటో కూడా బయటకు వెళ్లకూడదని కావాలనే ఇలా చేసారంట.
Also Read : The Girlfriend Success Meet : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. హాజరయిన బాయ్ ఫ్రెండ్.. ఫొటోలు వైరల్..
మీడియా సమాచారం ప్రకారం ఫోటోగ్రాఫర్స్ కి, వీడియో గ్రాఫర్స్ కి ముందే సూచనలు వెళ్లాయట. ఒక్క ఫోటో కూడా ఇద్దరూ కలిసి ఉన్నది తీయకూడదు, అసలు ఇద్దర్ని పక్కపక్కన నిల్చోబెట్టకూడదు అని. అందుకే ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి కూడా రాలేదు. స్పీచ్ ల సమయంలో కూడా ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో రాకుండా లైవ్ ఎడిటింగ్ లో విడివిడిగానే చూపించారు. ఇంతలా జాగ్రత్తపడ్డారు.
ఇక విజయ్ – రష్మిక కూడా పెళ్లి, నిశ్చితార్థం గురించి ఏమి మాట్లాడలేదు. కానీ రష్ అని, విజ్జు అని ప్రేమగా పిలిచి స్పీచ్ లు ఇచ్చారు. దీంతో ఎందుకు ఇంత జాగ్రత్తలు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇదంతా కావాలనే చేశారట. వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే ఫోకస్ అంతా సినిమా గురించి కాకుండా వీరి మీదకు వెళ్తుందని, వార్తలు అన్ని వీళ్ళ గురించే వస్తాయని, సినిమాని ఎవరూ పట్టించుకోరని భావించి అలా చేశారట. దీంతో విజయ్ – రష్మిక ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫోటో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
