Rashmika Ranbir : ఫ్లైట్ వదిలేసి ముద్దులేంటి.. రష్మిక రణబీర్ యానిమల్ సాంగ్ పై ఫుల్ ట్రోల్స్.. విజయ్ దేవరకొండని కూడా కలిపి..

యానిమల్ సినిమా నుంచి అమ్మాయే.. అని సాగే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ పై ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.

Rashmika Ranbir : ఫ్లైట్ వదిలేసి ముద్దులేంటి.. రష్మిక రణబీర్ యానిమల్ సాంగ్ పై ఫుల్ ట్రోల్స్.. విజయ్ దేవరకొండని కూడా కలిపి..

Rashmika Ranbir Animal Movie Song Full Trolling in Social Media

Updated On : October 12, 2023 / 8:44 AM IST

Rashmika Mandanna Ranbir Kapoor : రష్మిక మందన్న ప్రస్తుతం రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో ‘యానిమల్’(Animal) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక నిన్న ఈ సినిమా నుంచి అమ్మాయే.. అని సాగే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో రణబీర్ కపూర్, రష్మిక లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. ఇంట్లో ఫ్యామిలీ అందరి ముందు లిప్ కిస్ పెట్టుకోవడం, ఇద్దరూ సొంత ఫ్లైట్ లో వాళ్ళే నడుపుకుంటూ వెళ్లడం, ఫ్లైట్ లో కూడా ఇద్దరూ ఫ్లైట్ ని నడిపిస్తునే లిప్ కిస్ ఇచ్చుకోవడం, మధ్యలో ఫ్లైట్ ని వదిలేసి మరీ కిస్ ఇచ్చుకోవడం, రష్మికకి రణబీర్ ఫ్లైట్ డ్రైవింగ్ నేర్పించడం.. ఇలా చాలా ఊహించని సీన్స్ పెట్టాడు డైరెక్టర్. ఇక ఈ సాంగ్ చూస్తుంటే అందరికి అర్జున్ రెడ్డి సినిమానే గుర్తొచ్చింది.

అయితే ఈ సాంగ్ పై ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇన్నాళ్లు బైక్ మీద, కార్ లో ముద్దులు పెట్టుకోవడం చూశాం కానీ ఫ్లైట్ నడుపుతూ కిస్ ఇచ్చుకోవడం, అదేదో బైక్ నేర్పించినంత సింపుల్ గా ఫ్లైట్ నేర్పించడం, ఫ్లైట్ స్టీరింగ్ వదిలేసి మరీ కిస్ లు పెట్టుకోవడం.. ఇవన్నీ ఓవర్ గా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా, పలువురు మీమర్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే విజయ్ దేవరకొండని కూడా కలిపి ట్రోల్ చేస్తున్నారు.

Also Read : Unstoppable Season 3 : షూటింగ్ కూడా అయిపోయింది.. అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ వచ్చేది ఆ రోజే..

విజయ్ – రష్మిక రిలేషన్ లో ఉన్నారని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ రెండు సినిమాల్లో లిప్ కిస్ లు కూడా పెట్టుకున్నారు. దీంతో విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ని రణబీర్ కపూర్ కిస్ చేస్తున్నట్టు, విజయ్ బాధపడుతున్నట్టు మీమ్స్, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి యానిమల్ సినిమా రష్మిక రణబీర్ లిప్ కిస్సులతో ట్రెండ్ అవుతుంది.