Raveena Tandon : నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని.. బన్నీపై ఆ హీరోయిన్ ట్వీట్
ఈ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ 'కేజీఎఫ్ 2'లో ప్రధానమంత్రి రమికా సేన్ క్యారెక్టర్లో అద్భుతమైన నటనని ప్రదర్శించిన ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ రిప్లై............

Ramika Sen
Allu Arjun : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, స్టార్లు అభినందనలు కురిపిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘కేజీఎఫ్ 2’ సినిమాపై, సినిమాలో నటించిన నటులపై ప్రశంశల వర్షం కురిపించారు.
అల్లు అర్జున్ ‘కేజీఎఫ్ 2’ సినిమాలోని నటుల్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. అందులో ”కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్‌కు అభినందనలు. యశ్ గారు మీ నటన అద్భుతం. సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి మరియు మిగిలిన నటులంతా కూడా బాగా నటించారు. రవి బస్రూర్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. కెమెరామన్ భువనగౌడ ఎక్సలెంట్ విజువల్స్ అందించారు. ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులందరికి గౌరవాభినందనలు” అని ట్వీట్ చేశారు.
Allu Arjun : ‘రాకీ భాయ్’ పై ‘పుష్ప’ స్పెషల్ ట్వీట్..
దీంతో ఈ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ ‘కేజీఎఫ్ 2’లో ప్రధానమంత్రి రమికా సేన్ క్యారెక్టర్లో అద్భుతమైన నటనని ప్రదర్శించిన ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ రిప్లై ఇచ్చింది. బన్నీ చేసిన ట్వీట్ ని షేర్ చేస్తూ..”థ్యాంక్ యు అల్లు అర్జున్ గారు. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. నాకు పుష్ప సినిమా చాలా బాగా నచ్చింది. మీ దగ్గరి నుంచి అలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేసింది. దీంతో బన్నీ అభిమానులు ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.
Thank you @alluarjun ??????? am a huge fan ! Loved you in #pushpa and many more to come! https://t.co/1zqpc4puVD
— Raveena Tandon (@TandonRaveena) April 22, 2022