మాస్ మహరాజ్ కూడా వస్తున్నాడు : F 2 సీక్వెల్

దర్శకుడు అనిల్ రవిపూడి తన సంక్రాంతి విడుదల F2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) కు వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ ను చూసి సంతోషిస్తున్నారు. నా మునుపటి మూడు సినిమాలు యాక్షన్, నాటకం కావడంతో, ఈ సారి నేను పూర్తిగా హాస్య కేపెర్ చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు.
ఈ సారి వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ముగ్గురితో అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రానికి కథ రెడీ చేస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. రాజా ది గ్రేట్ చిత్రంలోని రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ నే ఇందులో కూడా చూపించబోతున్నాడట. ఆ పాత్రలోనే రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ హాస్యాన్ని పండించాడు. ఎఫ్3 లో మరింత ఫన్ ఉండేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా త్వరలో ఎఫ్–3 చిత్రం తీస్తానని ఎఫ్–2 దర్శకుడు అనీల్ రావిపూడి తెలిపారు. నెల్లూరులోని ఎస్ 2 థియేటర్స్‌లో ఎఫ్–2 చిత్ర బృందం సందడి చేసింది. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనీల్ మాట్లాడుతూ ఎఫ్–2 చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సినిమా తీసిన తరువాత వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో ఎఫ్–3 చిత్రం తీస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ హరి, యూవీ క్రియేషన్స్ హెడ్‌ఓడీ మాగుంట ఆదిత్యబాబు పాల్గొన్నారు.