మాస్ మహారాజ్ రవితేజకు ఏమైంది? స్టోరీ సెలెక్షన్స్‌లో బోల్తా కొడుతున్నాడా?
ఒకప్పుడు నాకు రవితేజ అంటే సినిమా, సినిమా అంటే రవితేజ. కానీ..

Raviteja
మాస్ మహరాజ్ రవితేజకు ఏమైంది. ఒకప్పటి రవితేజను మళ్లీ వెండితెరపై చూడలేమా? సూపర్ హిట్స్ చిత్రాలతో అభిమానులను ఊర్రూతలూగించిన మాస్ మహరాజ్.. సక్సెస్ అందుకుని ఎంతకాలమైంది..? మిస్టర్ బచ్చన్ తర్వాత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన రవితేజ. స్టోరీ సెలెక్షన్స్‌లో బోల్తా కొడుతున్నాడా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ కూడా ఇదే విషయంపై లేఖలు రాస్తున్నారు. అన్నయ్యా… నా గుండె బద్దలైందంటూ ఓ అభిమాని రాసిన లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.
రవితేజ సినిమాలు రానురాను తీసికట్టుగా తయారవుతున్నాయి. దర్శకులు రవితేజను ఇలా తయారుచేశారా లేక రవితేజ మైండ్ సెట్ మారిపోయిందా అనేది ఎవ్వరికీ తెలియడం లేదు. ప్రేక్షకులు మాత్రం వింటేజ్ రవితేజను మిస్సయ్యామంటున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత అభిమానుల ఆవేదన రెట్టింపైంది. ఇక రవితేజ ఇంతేనా అనే నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు అభిమానులు. ఓ అభిమాని అయితే ఏకంగా ఓ లేఖ రాసి రవితేజపై తాను పెంచుకున్న ప్రేమ అంతా పటాపంచలవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అభిమాని లేఖ
ఒకప్పుడు నాకు రవితేజ అంటే సినిమా, సినిమా అంటే రవితేజ. కానీ నేను చిన్నతనంలో ప్రేమించిన రవితేజను ఇకపై చూడలేనని చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు మీ చిత్రాల్లో నన్ను ఆకర్షించిన మేజిక్ ఇప్పుడు కనుమరుగైంది. మీ సినిమాలతో కనెక్ట్ అవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను. అన్నయ్యా.. నా గుండె బద్దలైంది. ప్లీజ్ అర్థం చేసుకోండి.. అంటూ లేఖ రాశాడు ఆ అభిమాని…. నిజంగా ఫ్యాన్స్ చెప్పినట్లు ఒకప్పుడు రవితేజ అంటే సూపర్ ఎనర్జీటిక్ హీరో.. క్యారక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరోగా తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేవాడు రవితేజ. అలాంటి రవితేజకు ఏమైందో చాలాకాలం నుంచి హిట్ సినిమా అన్నదే ఇవ్వలేకపోతున్నాడు. క్రేక్ సినిమా తర్వాత రవితేజ మరో హిట్ లేకపోయింది. దీంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.
మాస్ మహారాజ్ అని ముద్దుగా పిలుపించుకున్న రవితేజ స్టోరీ సెలెక్షన్ గాడీ తప్పడం వల్లే సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొడుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రవితేజ వరసుగానే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ అన్ని “సినిమాలు పోతున్నవే” చేస్తున్నారంటూ రవితేజ వీరాభిమానులు ఫీల్ అవుతున్నారు.
ఒక సినిమా కాకపోయిన మరో సినిమాతో అయిన హిట్ కొడతాడని ఎదురు చూస్తున్నామని, కానీ రవితేజలో ఎటువంటి మార్పులు రావటం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇక లాభం లేదనుకొని డైరెక్ట్‌గా రవితేజకు సలహాలిస్తున్నారు. అన్నయ్యా ఒక సారి మా మాట వినండంటూ అభిమాని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మరి అభిమానుల సలహాలను రవితేజ స్వీకరిస్తారా? అన్నది చూడాల్సివుంది.
Also Read : బ్రహ్మా ఆనందం గ్లింప్స్ చూశారా..? ఎంట్రీ అదిరిపోయింది