డిస్కోరాజాగా రవితేజ

రవితేజ బర్త్‌డే సందర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని లాంచ్ చేసింది మూవీ యూనిట్.

  • Published By: sekhar ,Published On : January 26, 2019 / 05:02 AM IST
డిస్కోరాజాగా రవితేజ

Updated On : January 26, 2019 / 5:02 AM IST

రవితేజ బర్త్‌డే సందర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని లాంచ్ చేసింది మూవీ యూనిట్.

మాస్ మహరాజ రవితేజ, వి.ఐ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో రూపొందబోయే కొత్త సినిమాకి, గతకొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న డిస్కోరాజా టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ, రవితేజ బర్త్‌డే సందర్భంగా  డిస్కోరాజా టైటిల్ లోగోని లాంచ్ చేసింది మూవీ యూనిట్. రెక్కలు చాపిన బటర్‌ఫ్లై మధ్యలో, ఇంగ్లీష్‌లో Disco అని, తెలుగులో రాజా అని కలర్‌ఫుల్‌గా డిజైన్ చేసారు. టైటిల్ పైన రవితేజ ఈజ్ అనేది కొట్టేసి, వాజ్ అని వెయ్యడం, టైటిల్ కింద రివైండ్, ఫాస్ట్ ఫార్వార్డ్, పక్కనే ఉన్న ప్లే కొట్టేసి, కిల్ అని రాయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

డిస్కో రాజా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ అని తెలుస్తుంది. రవితేజ పక్కన నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేశ్, ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ ఇంపార్టెంట్ రోల్ చెయ్యనున్నాడు. ఎస్‌.ఆర్‌.టి. బ్యానర్‌పై రాజనీ తాళ్ళూరి నిర్మిస్తున్నడిస్కోరాజాకి సంగీతం : థమన్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి, ఆర్ట్ : నాగేంద్ర.టి.