Raviteja : తన వారసుడు కంటే ముందు.. తమ్ముడు కొడుకుని లాంచ్ చేస్తున్న రవితేజ.. మిస్టర్ ఇడియట్!

రవితేజ తన కొడుకుని హీరోగా పరిచయం చేయడం కంటే ముందు తన తమ్ముడు కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నాడు.

Raviteja : తన వారసుడు కంటే ముందు.. తమ్ముడు కొడుకుని లాంచ్ చేస్తున్న రవితేజ.. మిస్టర్ ఇడియట్!

Raviteja launch his brother son as hero with mr idiot movie

Updated On : July 9, 2023 / 7:09 PM IST

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నేడు భారీ మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసి 33 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే రవితేజ అభిమానులు మాత్రం మాస్ మహారాజ్ వారసుడి ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘రాజా ది గ్రేట్’ సినిమాలో నటించి ఆడియన్స్ కి పరిచయం అయిన రవితేజ కొడుకు ‘మహాధన్’ హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ రవితేజ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

HER – Chapter 1 Trailer : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రుహాణి శర్మ HER ట్రైలర్ రిలీజ్

అయితే తన కొడుకు కంటే ముందు రవితేజ తన తమ్ముడు కొడుకుని లాంచ్ చేయబోతున్నాడు. రవితేజ బ్రదర్ రఘు కుమారుడు ‘మాధవ్’ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ లోగోని నేడు రవితేజ రిలీజ్ చేస్తూ మాధవ్ ని ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ‘Mr ఇడియ‌ట్‌’ అనే టైటిల్ ని మూవీకి ఖరారు చేశారు. తన కెరీర్ లో ఇడియట్ సినిమా ఎంతో కీ రోల్ ప్లే చేసిందని, ఇప్పుడు తన తమ్ముడు రఘు కొడుకు మాధ‌వ్ కెరీర్ లో ‘Mr ఇడియ‌ట్‌’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

Ileana : తొమ్మిదో నెల గర్భంతో ఇలియానా.. చాలా అలసటగా ఉందంటూ పోస్ట్..!

ఇక రిలీజ్ చేసిన టైటిల్ లోగో పోస్టర్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ‘పెళ్లి సందD’ సినిమాని తెరకెక్కించిన గౌరీ రోణంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఇది ఇలా ఉంటే, ఇవాళే రవితేజ కూడా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. తనకి హ్యాట్రిక్ హిట్టు అందించిన గోపిచంద్ మలినేనితో కలిసి రవితేజ మరోసారి పని చేయబోతున్నాడు.