Raviteja : బాలీవుడ్లో రవితేజ మల్టీస్టారర్.. నిజమేనా?
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ త్వరలో బాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతున్నాడట. వరుణ్ ధావణ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్..

Raviteja Multistarrer with Varun Dhawan in bollywood
Raviteja : మాస్ మహారాజ రవితేజ ఇటీవలే ధమ్కీ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి బాక్స్ ఆఫీస్ కి తన సత్తా ఏమి తగ్గలేదని మరోసారి చూపించాడు. ఇక తాజాగా రావణాసుర (Ravanasura) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 7న రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ అని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో రవితేజ ఇప్పటి వరకు కనిపించని ఒక డిఫరెంట్ రోల్ లో నటించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేశాడు. ఇది ఇలా ఉంటే, రవితేజ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.
Ravanasura Movie: రావణాసుర ఫస్ట్‌డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
అదేంటంటే, రవితేజ బాలీవుడ్ లో ఒక మల్టీస్టారర్ చేబోతున్నాడట. బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్‌తో (Varun Dhawan) కలిసి రవితేజ ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ బి – టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని రానా దగ్గుబాటి (Rana Daggubati), కరణ్ జోహార్ (Karan Johar), ఏషియన్ మూవీస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా సౌత్ సూపర్ హిట్ మానాడు (Maanaadu) కి రీమేక్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు అన్నిటిలో నిజం ఎంత వరకు ఉందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
కాగా రవితేజ తన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా 1970 కాలంలో స్టూవర్ట్‌పురం గజ దొంగగా పేరు గాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌గా తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.