బర్త్‌డే నాడు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

బర్త్‌డే నాడు రెండు సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాఖా ఇవ్వనున్నాడు మాస్ మహరాజా. 

  • Published By: sekhar ,Published On : January 24, 2019 / 09:28 AM IST
బర్త్‌డే నాడు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

Updated On : January 24, 2019 / 9:28 AM IST

బర్త్‌డే నాడు రెండు సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాఖా ఇవ్వనున్నాడు మాస్ మహరాజా. 

టచ్ చేసిచూడు, నేలటికెట్, అమర్ అక్బర్ ఆంటోని లాంటి వరస ఫ్లాప్‌లతో సతమత మవుతున్న మాస్ మహరాజ రవితేజ తన తర్వాత సినిమాని, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం సినిమాలతో గుర్తింపు తెచ్చకున్న వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో చెయ్యబోతున్నాడు. దీంతోపాటు కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్‌తో తమిళ్ తెరి మూవీ రీమేక్‌లోనూ నటించనున్నాడు. రవితేజ బర్త్‌డే సందర్భంగా జనవరి 26న వి.ఐ.ఆనంద్ సినిమా టైటిల్ లోగోని రిలీజ్ చెయ్యనున్నారు. ఎస్‌.ఆర్‌.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి డిస్కోరాజా అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేశ్, ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా ఫిక్సయ్యారు. ఈ సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఉండబోతుందట. ఇదిలా ఉంటే, తమిళ్‌లో దళపతి విజయ్ నటించిన తెరి సినిమా కథకి, రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కించ బోతున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. బర్త్‌డే నాడు రెండు సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాఖా ఇవ్వనున్నాడు మాస్ మహరాజా.