Raviteja : టీవీ షోలో చేతిపై బీర్ బాటిల్ పగలగొట్టి.. బాలీవుడ్‌లో రవితేజ రచ్చ..

‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. రవితేజ అయితే బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోషన్స్ చేస్తూ అక్కడి ఛానల్స్, సైట్స్, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Raviteja : టీవీ షోలో చేతిపై బీర్ బాటిల్ పగలగొట్టి.. బాలీవుడ్‌లో రవితేజ రచ్చ..

Raviteja Participated in Bollywood TV Show for Tiger Nageswara Rao Promotions

Updated On : October 14, 2023 / 5:07 PM IST

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’(Tiger Nageswararao) సినిమాతో దసరాకి రాబోతున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై ద‌ర్శ‌కుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.

‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. రవితేజ అయితే బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోషన్స్ చేస్తూ అక్కడి ఛానల్స్, సైట్స్, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏకంగా బాలీవుడ్ టీవీ షోలో కూడా పాల్గొని మరీ తన ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవల రవితేజ బాలీవుడ్ లో వచ్చే ‘ఇండియాస్ గాట్ ట్యాలెంట్’ అనే షోలో పాల్గొన్నాడు.

తాజాగా రవితేజ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో రవితేజ హీరోయిన్స్ తో ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. అలాగే ఓ బీర్ బాటిల్ ని తీసుకొని తన చేతిమీద పగలగొట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కొంతమంది రవితేజ ఇలా కూడా చేస్తాడా అని ఆశ్చర్యపోతుంటే, మరికొంతమంది సినిమా కోసం, సినిమా ప్రమోషన్స్ కోసం రవితేజ ఏమైనా చేస్తాడు అనడానికి ఇది కూడా ఉదాహరణ అని పొగుడుతున్నారు.

Also Read : Amardeep Priyanka : బిగ్‌బాస్‌లో ఉన్న అమర్ దీప్, ప్రియాంక జైన్ కలిసి చేసిన తెలంగాణ ఫోక్ సాంగ్ చూశారా?

మొత్తానికి బాలీవుడ్ షోలో ఒక హీరో ఇలా చేతిమీద బీర్ బాటిల్ పగలగొట్టుకోవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఇదే షోకి వెళ్ళినప్పుడు ఈ షోలో జడ్జిగా చేసే శిల్పాశెట్టితో రవితేజ డ్యాన్స్ వేసిన వీడియో ఇటీవల బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.