Tiger Nageswara Rao : రవితేజకు షాక్.. టైగర్ నాగేశ్వరరావు సినిమాని ఆపేయాలి.. నిరాహార దీక్ష చేస్తున్న స్టువర్టుపురం ప్రజలు..
ఎరుకల జాతికి చెందిన టైగర్ నాగేశ్వర రావుని గజదొంగలా చూపిస్తూ, స్టువర్టుపురం గ్రామాన్ని నేర రాజధానిగా చూపిస్తున్నారంటూ, మమ్మల్ని కించపరుస్తున్నారని, సినిమాని ఆపాలని పలువురు నిరాహార దీక్ష చేస్తున్నారు.

Raviteja Tiger Nageswara Rao Movie in Troubles Stuvartpuram Village people doing Protest
Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఒక్కప్పుడు స్టువర్టుపురం(Stuvartpuram) గజదొంగగా(Thief) పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో మాస్ మహారాజ కనపడబోతున్నాడు. కొత్త దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ బాగా వైరల్ అయి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి
అయితే టైగర్ నాగేశ్వర రావు సినిమాకి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై స్టూవర్టుపురం ప్రజలు, మరికొంతమంది కోర్టులో కేసు వేశారు. కోర్టు కూడా టైగర్ నాగేశ్వర రావు టీంని హెచ్చరించింది. తాజాగా ఈ సినిమా వివాదంలో నిలిచింది.
తమ ఎరుకల జాతిని, తమ గ్రామాన్ని కించపరిచేవిధంగా సినిమా తీస్తున్నారంటూ స్టువర్టుపురం ప్రజలు గొడవ చేస్తున్నారు. ఎరుకల జాతికి చెందిన టైగర్ నాగేశ్వర రావుని గజదొంగలా చూపిస్తూ, స్టువర్టుపురం గ్రామాన్ని నేర రాజధానిగా చూపిస్తున్నారంటూ, మమ్మల్ని కించపరుస్తున్నారని, సినిమాని ఆపాలని పలువురు నిరాహార దీక్ష చేస్తున్నారు. స్టువర్టుపురం గ్రామ ప్రజలు, ఎరుక జాతికి సంబంధిన వాళ్ళు విజయవాడలో నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
టైగర్ నాగేశ్వర రావు సినిమాని కనుక ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్టువర్టుపురం ప్రజలు అంటున్నారు. ఈ సినిమా వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సినిమా తీసేముందు దర్శక నిర్మాతలు ఎవరూ స్టువర్టుపురం ప్రజలని సంప్రదించలేదని వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.