Spirit : ప్రభాస్ కోసం త్రివిక్రమ్, రవితేజ వారసులు.. ‘స్పిరిట్’ డైరెక్షన్ టీమ్ ఇదే.. ఈ ఫొటోలో వాళ్ళను గుర్తుపట్టారా?
నవంబర్ 23న ప్రభాస్ స్పిరిట్ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. (Spirit)
spirit direction team
Spirit : ప్రభాస్ లైనప్ లో ఉన్న భారీ సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే నవంబర్ 23న స్పిరిట్ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రభాస్ ని చూపించకుండా ఈ పూజా కార్యక్రమం నుంచి పలు ఫొటోలు కూడా రిలీజ్ చేసారు.(Spirit)
స్పిరిట్ సినిమా ఓపెనింగ్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. దీంతో చిరంజీవితో మూవీ టీమ్ దిగిన పలు ఫొటోలు కూడా షేర్ చేసారు. ఈ క్రమంలో స్పిరిట్ డైరెక్షన్ టీమ్ అంతా కూడా కలిసి సందీప్ రెడ్డి వంగ, చిరంజీవితో కలిసి స్పెషల్ ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రవితేజ, త్రివిక్రమ్ తనయులు ఉండటం గమనార్హం.
Also Read : Suman : జైలు జీవితం టెర్రరిస్టుల మధ్య.. నా కోసం కరుణానిధి, ఆ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే సపోర్ట్..
రవితేజ తనయుడు మహాధన్, త్రివిక్రమ్ తనయుడు రిషి స్పిరిట్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరూ సినీ పరిశ్రమలోకి వస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావడం గమనార్హం. మహాధన్ వెంకీ అట్లూరి వద్ద కూడా దర్శకత్వ శాఖలో పనిచేసాడు. ఇలా స్టార్ హీరో, దర్శకుడి వారసులు సందీప్ రెడ్డి వద్ద శిష్యరికం చేస్తుండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

మరి భవిష్యత్తులో రిషి,మహాధన్ లు దర్శకులుగా మారతారేమో చూడాలి. ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ తో కలిసి పనిచేసి ఈ ఇద్దరిలో ఫ్యూచర్ లో ఎవరైనా ప్రభాస్ తో సినిమా చేస్తే ఆ కాంబోపై భారీ అంచనాలు రావడం ఖాయం.
