Suman : జైలు జీవితం టెర్రరిస్టుల మధ్య.. నా కోసం కరుణానిధి, ఆ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే సపోర్ట్..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ తన జైలు జీవితం గురించి మాట్లాడారు. (Suman)

Suman : జైలు జీవితం టెర్రరిస్టుల మధ్య.. నా కోసం కరుణానిధి, ఆ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే సపోర్ట్..

Suman

Updated On : November 24, 2025 / 3:38 PM IST

Suman : ఒకప్పటి హీరో, నటుడు సుమన్ ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. తాజాగా సుమన్ 10టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమన్ 1985 లో పలు కేసుల్లో అక్రమంగా జైలుకు వెళ్లారు. బెయిల్ మీద బయటకు వచ్చినా మూడేళ్ళ పాటు ఆ కేసు కొనసాగి అది అబద్దపు కేసు అని కొట్టేసారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ తన జైలు జీవితం గురించి మాట్లాడారు.

Also Read : Suman : ఒక్క సినిమా.. డైరెక్ట్ ప్రసిడెంట్ ఆఫ్ ఇండియాతో కుర్చోపెట్టింది.. హాఫ్ డే ఆయనతో..

సుమన్ మాట్లాడుతూ.. నన్ను జైలులో టెర్రరిస్టులు, నక్సలైట్స్ మధ్య పెట్టారు. వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు. జైల్లో ఉన్న వాళ్లంతా చెడ్డవాళ్లు కాదు. పరిస్థుతుల వల్ల అక్కడికి వస్తారు. చాలా చదువుకున్న వాళ్ళు ఏదో ఒక అవసరం కోసం తప్పుచేసి వచ్చారు. అప్పుడు తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధి. ఆయనను జైలు లో వేశారు. నన్ను టెర్రరిస్టులతో ఉంచారని అక్కడ్నుంచి మార్చాలని ఆయన నా కోసం పోరాడారు.

ఆయన పోరాటం వల్లే వాళ్ళ మధ్యలో, క్లోజ్ ప్రిజన్ లో ఉన్న నన్ను మాములు ఖైదీల మధ్యకు తీసుకొచ్చారు. జైలులో మనకు ఫుడ్, హెల్త్ విషయంలో ఏం కావాలి అన్నా హెల్త్ సమస్యలు చూపించి అడిగితే కోర్ట్ ఇస్తుంది. నేను జైలుకు వెళ్ళినప్పుడు ఎవరూ పబ్లిక్ గా మాట్లాడలేదు. వాళ్ళు కూడా భయపడ్డారేమో. కేవలం హీరోయిన్స్ సుమలత, సుహాసిని ఇద్దరే సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు మీడియా ముందుకొచ్చి సుమన్ అలాంటివాడు కాదు అని మాట్లాడారు. మోహన్ బాబు జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఇంటికి వచ్చి పూల దండ వేసి బాబా ఆశీస్సులు ఉంటాయి అని ధైర్యం ఇచ్చారు అని తెలిపారు.

అలాగే ఈ కేసుకు చిరంజీవికి సంబంధం లేదని, అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే అని కూడా ఆ కేసు గురించి సుమన్ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి వల్లే తను జైలుకు వెళ్ళాడు అనే ఆరోపణలపై సుమన్ క్లారిటీ ఇచ్చాడు. దాని గురించి ఇందులో చదివేయండి.. → Chiranjeevi : పూర్తిగా క్లారిటీ ఇచ్చిన సుమన్.. బ్లూ ఫిలిమ్స్ కేసు.. అది చేసింది చిరంజీవి కాదు.. నా మీద గుండా యాక్ట్ పెట్టి..