Jathara : రా & రస్టిక్ సినిమా ‘జాతర’ రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మరో పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Jathara : రా & రస్టిక్ సినిమా ‘జాతర’ రిలీజ్ డేట్ అనౌన్స్..

Raw and Rustic Jathara Movie Release Date Announced

Updated On : October 25, 2024 / 8:30 PM IST

Jathara : ఇటీవల పలువురు దర్శకులు హీరోలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి డైరెక్టర్ సతీష్ బాబు కూడా చేరాడు. సతీష్ బాబు హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Sai Durga Tej : ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి.. యాక్సిడెంట్ రోజును గుర్తుచేసుకున్న సాయి దుర్గ తేజ్..

ఈ సినిమా నుంచి గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మరో పోస్టర్ ని రిలీజ్ చేసారు. జాతర సినిమా నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే టీజర్, ట్రైలర్స్ ని రిలీజ్ చేయనుంది. ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో జాతర సినిమా రాబోతుందని సమాచారం.

Raw and Rustic Jathara Movie Release Date Announced