Rayavalasa : కొడుకుని హీరోగా పెట్టి డైరెక్టర్ గా మారిన తల్లి.. ‘రాయవలస’ టీజర్ చూశారా..?
మీరు కూడా రాయవలస టీజర్ చూసేయండి.. (Rayavalasa)
Rayavalasa
Rayavalasa : కార్తిక్ జయంతి, శ్రీష జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా రాయవలస. RaysuN ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోపీ కృష్ణ జె నిర్మాణంలో రాధిక జయంతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. “Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్ తో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించగా యువ హీరో ఆకాష్ జగన్నాథ్ గెస్ట్ గా హాజరయ్యారు.
మీరు కూడా రాయవలస టీజర్ చూసేయండి..
Also Read : Jagapathi Babu : పులిని చూసి నక్క వాతపెట్టుకోకూడదు.. రాజమౌళి చేసాడని అందరూ అలా చేస్తే ఎలా..
టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మ డైరెక్టర్‌గా, వాళ్ల నాన్న నిర్మాతగా ఉండడం క్రేజీగా అనిపించింది. రాధిక గారికి హ్యాట్సాఫ్. తనంత బాధ్యత తీసుకుని వాళ్ల అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా మేకింగ్ లో ఎన్నో విషయాలు దగ్గరుండి చూసుకున్నాడు. హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. తల్లి డైరెక్ట్ చేయడం, ఫాదర్ ప్రొడ్యూస్ చేయడం, కొడుకు హీరోగా చేయడం ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు అని అన్నారు.
హీరో కార్తీక్ మాట్లాడుతూ.. నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే. నేను చేయాలనుకున్నది సినిమానే. దానికి తోడ్పడిన మా అమ్మకి థాంక్యూ. నాకు మా నాన్న సపోర్ట్ చేస్తూ ఇక్కడివరకు తీసుకొచ్చారు. రాయవలస రియల్ లైఫ్ ఆధారంగా తీసుకున్న స్టోరీ. అందరూ కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకి హార్ట్ అని తెలిపారు.

డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ.. ఒక తల్లిగా కొడుకుని లాంచ్ చేయడం చాలా పెద్ద విషయం. నేను చేసిన ‘మాయ’ ఫిలింకి యూఎస్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాం. రాఖీ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది అని అన్నారు. నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ.. RaysuN ప్రొడక్షన్స్‌ను మేము పదేళ్ల క్రితమే మొదలుపెట్టాము. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాము. ఫైనల్‌గా ఇప్పుడు థియేటర్ మూవీతో వస్తున్నాము అని తెలిపారు.
