Jagapathi Babu : పులిని చూసి నక్క వాతపెట్టుకోకూడదు.. రాజమౌళి చేసాడని అందరూ అలా చేస్తే ఎలా..
తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Jagapathi Babu)
Jagapathi Babu
Jagapathi Babu : సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలు, తండ్రి పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. జగపతి బాబు ఏదైనా ముక్కు సూటిగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని తెలిసిందే. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ ఇప్పుడు ఎదుగుతుంది. అదే సమయంలో పడిపోతుంది కూడా. రాజమౌళి ఒక గ్రేట్ టెక్నిషియన్. ఆయన బాహుబలి తీసాడని అందరూ బాహుబలి తీయడం మొదలుపెడితే అయిపోతారు. పులిని చూసి నక్క వాతపెట్టుకోకూడదు. వాళ్ళు అంత పెట్టి తీసారు కాబట్టి మనం వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీయొచ్చు అనేది కరెక్ట్ ఆలోచన కాదు. మనం ఎంత చేయాలో అంతే చేయాలి. మనం ఎంతలో చేయగలమో మనకు తెలుసు, అందులోనే చేయాలి. ఈ మధ్య అందరూ పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నారు అసలు సెలబ్రిటీ అవకుండానే అని అన్నారు.
Also Read : MS Dhoni : ‘పెద్ది’ ప్లాన్ మాములుగా లేదుగా.. ఏకంగా మహేంద్ర సింగ్ ధోనిని తీసుకొస్తున్నారా?
ఇటీవల బాహుబలి, పుష్ప సక్సెస్ ల తర్వాత చాలా మంది పాన్ ఇండియా అని చెప్పి మిగిలిన భాషల్లో కేవలం డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. పేరుకు పాన్ ఇండియా అయినా వేరే భాషల్లో మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఇలా సినిమాలు చేసిన వాళ్లంతా రాజమౌళిని చూసి చేతులు కాల్చుకున్నవారే. అలాంటి వాళ్ళని ఉద్దేశించి జగపతి బాబు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
