MS Dhoni – Ram Charan: ‘పెద్ది’ ప్లాన్ మాములుగా లేదుగా.. ఏకంగా మహేంద్ర సింగ్ ధోనిని తీసుకొస్తున్నారా?
పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. (MS Dhoni)
Ms Dhoni As Guest For Ram Charan Peddi North Event Rumours
MS Dhoni – Ram Charan : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రెండు గ్లింప్స్, రెండు సాంగ్స్ మాత్రమే వచ్చినా హైప్ మాత్రం భారీగా ఉంది. ఇందులో చరణ్ కుస్తీ, క్రికెట్ రెండూ ఆడబోతున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. తాజాగా మూవీ యూనిట్ సమాచారం ప్రకారం నార్త్ లో ఓ పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకు బీహార్ పాట్నాలో ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు అలాగే జార్ఖండ్ రాంచిలో పెద్ది సినిమాకు భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.
Also Read : Anand Deverakonda : అన్నయ్య పుట్టిన రోజు.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ఆనంద్ దేవరకొండ..
ఈ రాంచి ఈవెంట్ కి రాంచిలోనే ఉండే టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని గెస్ట్ గా తీసుకురావడానికి మూవీ టీమ్ ప్రయత్నిస్తుందని సమాచారం. గతంలో చరణ్, ధోని పలుమార్లు కలిశారు. వీరిద్దరికి మంచి పరిచయమే ఉంది. ఇప్పుడు పెద్ది సినిమాకు ధోని ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ ఇది నిజమయితే బాగుండు అని కోరుకుంటున్నారు. ధోని నిజంగానే పెద్ది సినిమా ఈవెంట్ కి వస్తే నార్త్ లో మంచి హైప్ రావడంతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతారు. ఈ సినిమాలో చరణ్ క్రికెట్ ప్లేయర్ గా కూడా కనిపిస్తుండటంతో ధోనిని తీసుకొస్తే మరింత ప్రమోట్ అవుద్దనే మూవీ యూనిట్ ఇలా ప్లాన్ చేస్తున్నారట.
