kamal haasan: రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారితే సినిమాను వదిలేస్తా – కమల్ హాసన్

Kamal Hassan Two
kamal haasan:తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఏప్రిల్ 6న ఈ రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు మక్కల్ నీధి మయం అధినేత కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన అనేక విషయాలపై స్పందించారు. రాజకీయ జీవితానికి అడ్డుగా వస్తుందనుకుంటే తాను సినిమాని వదిలేస్తానని తెలిపారు.
జీవితాన్ని ప్రజాసేవకు అంకితమిస్తానని కమల్ వివరించారు. రాజకీయాల్లో తన ప్రవేశం చారిత్రాత్మకమైనదని అన్నారు. తను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎం.జీ రామచంద్రన్ ఆదర్శాలను ప్రచారం చెయ్యడానికి, ప్రజలకు సేవ చేసే విధానాన్ని తెలిపేందుకు అనేక సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్రలు వేశానని కమల్ వివరించారు. చాలామంది సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారని, కానీ వారు తిరిగి సినిమాల్లోకి వెళ్లారని, తనకు అటువంటి ఆలోచన లేదని అన్నారు.
ప్రజలకు సేవ చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని కమల్ వెల్లడించారు. తనను వివిధ పార్టీల నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపిన కమల్, వారెవరు అనే విషయాన్నీ మాత్రం వెల్లడించలేదు. ప్రచారం సందర్బంగా తాను చేసిన ఖర్చులను ఎన్నికల కమిషన్ కు సమర్పించానని, తన ఖర్చులను చూసి ఎన్నికల అధికారులు ప్రశంశించారని కమల్ తెలిపారు. కాగా ఈ ప్రెస్ మీట్ కు కమల్ తోపాటు తమిళ సినీ ప్రముఖులు రాధిక శరత్‌కుమార్, సుహాసిని మణిరత్నం హాజరయ్యారు.
ఇదిలా ఉంటే మక్కల్ నీది మక్కల్ నీధి మయం 154 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక దాని మిత్రపక్షాలైన IJK, AISMK చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.