Salaar 2 : డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పటినుండే..

Salaar 2 : డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పటినుండే..

Rebel Star Prabhas Salaar 2 movie shooting

Updated On : October 23, 2024 / 3:14 PM IST

Salaar 2 : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన డార్లింగ్ ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. డార్లింగ్ మూవీ లైనప్ చూసి స్టార్ డైరెక్టర్స్ సైతం తన కోసం క్యూ కడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు.

అయితే నేడు డార్లింగ్ బర్త్ డే సంధర్బంగా తన రాబోయే సినిమాల నుండి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా రాజా సాబ్ నుండి మోషన్ పోస్టర్ విడుదల చెయ్యగా నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇందులో డార్లింగ్ ఎన్నడూ లేనివిధంగా ఒక ముసలాయన గెటప్ లో కనిపించడంతో ఈ మూవీ కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Also Read ; Raja Saab : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్ వచ్చేసింది.. తాత గెటప్ లో ప్రభాస్..

మరోవైపు సలార్ 2 పై కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సలార్ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. దీంతో పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుందని, 20 రోజుల షెడ్యూల్ షూటింగ్ లో డార్లింగ్ జాయిన్ కానున్నారని సమాచారం. ఇక ఇందులో పృద్విరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో శృతిహాసన్ హీరొయిన్ గా నటించారు.