Raja Saab : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్ వచ్చేసింది.. తాత గెటప్ లో ప్రభాస్..
తాజాగా నేడు ఈ సినిమా నుంచి స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Prabhas Birthday Special The Rajasaab Movie Motion Poster Released
Raja Saab : మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రభాస్ వి రెండు పోస్టర్స్ రిలీజ్ చేసారు. హారర్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తామని చెప్పారు. తాజాగా నేడు ఈ సినిమా నుంచి స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. మీరు కూడా రాజాసాబ్ మోషన్ పోస్టర్ చూసేయండి..
ఈ మోషన్ పోస్టర్ లో.. అడవిలో పియానో ప్లే అవుతుండగా ఒక భవంతిలోకి తీసుకెళ్లి ప్రభాస్ ముసలి గెటప్ లో చుట్ట కాలుస్తూ సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. ఈ మోషన్ పోస్టర్ అంతా హారర్ మ్యూజిక్ తో అదరగొట్టేసింది. చివర్లో హారర్ కొత్త రకం కామెడీ అని పోస్ట్ చేయడంతో ఈ సినిమా హారర్, కామెడీ జానర్లో ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రభాస్ తాత, మనవడు గెటప్స్ లేదా నాన్న, కొడుకు గెటప్స్.. రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.